తాబేలంటి సాలీళ్లు!

ఇవి చూడ్డానికి కాస్త తాబేళ్లలా కనిపిస్తున్నాయి కదూ! కానీ ఇవి తాబేళ్లు కాదు.. సాలీళ్లు..! అవును మీరు చదువుతోంది నిజమే ఇవి నిజంగా సాలీళ్లే.. వీటిని ‘టార్టాయిస్‌ స్పైడర్స్‌’ అని పిలుస్తుంటారు.

Published : 26 Aug 2021 00:37 IST

ఇవి చూడ్డానికి కాస్త తాబేళ్లలా కనిపిస్తున్నాయి కదూ! కానీ ఇవి తాబేళ్లు కాదు.. సాలీళ్లు..! అవును మీరు చదువుతోంది నిజమే ఇవి నిజంగా సాలీళ్లే.. వీటిని ‘టార్టాయిస్‌ స్పైడర్స్‌’ అని పిలుస్తుంటారు.

ఎన్సైయాసాకస్‌... ఏంటి అలా చూస్తున్నారు. పలకడానికి కాస్త ఇబ్బందిగా ఉంది కదూ! వీటి అసలు పేరు ఇదే మరి. ఎందుకొచ్చిన తంటాకానీ మనమూ ఎంచక్కా వీటిని ‘టార్టాయిస్‌ స్పైడర్స్‌’ అని పిలిచేద్దాం సరేనా!

అరుదైన ప్రాణులు

ఇవి చాలా.. చాలా.. అరుదైన జీవులు. ఇవి అమెజాన్‌ అడవుల్లో మాత్రమే జీవిస్తుంటాయి. అది కూడా కేవలం కొలంబియా, ఈక్వెడార్‌, పెరూ, బ్రెజిల్‌లో మాత్రమే కనిపిస్తుంటాయి. ఇవి ముదురు నారింజ రంగులో ఉండి.. వాటి మీద నలుపు రంగు చారలుంటాయి. వీటిలో మరికొన్ని రకాలూ ఉన్నాయి. తెలుపు రంగులో ఉండి నారింజరంగు చారలు ఉన్నవి, ముదురు, లేత నలుపు రంగులో ఉన్నవీ కనిపిస్తుంటాయి.

ఇవి చిరుజీవులు!

వీటిని మొట్టమొదటి సారిగా 1895లోనే గుర్తించారు. అయినప్పటికీ వీటి గురించి చాలా విషయాలు బాహ్య ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే ఇవి అంత అరుదైనవి మరి. ఇవి తాబేళ్ల రూపాన్ని పోలి ఉన్నప్పటికీ ఆకారంలో మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. మొత్తానికి ప్రస్తుతానికైతే ఇవే టార్టాయిస్‌ స్పైడర్స్‌ గురించి విశేషాలు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని