చిట్టితల్లి.. భలేగా కవితలల్లి..!

వయసేమో 12. చదువుతోంది 8వ తరగతి. కానీ ఏకంగా వందల కొద్దీ కవితలు రాస్తోంది. అందులో కొన్ని పుస్తకరూపంలో వచ్చాయి. ఇంకేం అతి చిన్న వయసులో ఎక్కువ కవితలు రాసిన చిన్నారిగా ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించుకుంది.

Published : 28 Aug 2021 00:22 IST

వయసేమో 12. చదువుతోంది 8వ తరగతి. కానీ ఏకంగా వందల కొద్దీ కవితలు రాస్తోంది. అందులో కొన్ని పుస్తకరూపంలో వచ్చాయి. ఇంకేం అతి చిన్న వయసులో ఎక్కువ కవితలు రాసిన చిన్నారిగా ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించుకుంది.

బెంగళూరుకు చెందిన ఆమ్నా ఇప్పటి వరకు 275 కవితలు ఇంగ్లిష్‌, హిందీలో రాసింది. ఇందులో 61 కవితలు ‘ఎకోస్‌ ఆఫ్‌ సోల్‌ఫుల్‌ పోయమ్స్‌’ అనే పుస్తకంగా ముద్రితయ్యాయి. అప్పటికి ఈ చిన్నారి వయసు 12 సంవత్సరాల అయిదు నెలల పది రోజులు. మరి కొన్ని కవితలు ముద్రణకు సిద్ధం అవుతున్నాయి. పత్రికలు, వెబ్‌సైట్లలోనూ కొన్ని కవితలు ప్రచురితమయ్యాయి.

కరోనా మీద కలం కదిలించి...

ఆమ్నా తన మొదటి కవితను కరోనా మీద రాసింది. అది రాయడానికి ఆమెకు కేవలం ఒక గంట మాత్రమే పట్టిందట! ముందుగా తనను ఏదైనా రాయమని వాళ్ల అమ్మ చెప్పిందట. తర్వాత ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్‌, తోటి విద్యార్థులు సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా ఇంగ్లిష్‌ టీచర్‌ వెన్నుతట్టి ప్రోత్సహించారు. భవిష్యత్తులో తాను మరిన్ని మంచి మంచి కవితలు రాస్తానని చెబుతోంది ఈ చిన్నారి. మరి, మన ఆమ్నాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని