ఆలోచనలకు రెక్కలిచ్చారు!

వయసు పదిహేనేళ్లు.. పుట్టుకతోనే మానసిక సమస్యలు. అయినా కుంగిపోలేదు. తనలాగే ఇబ్బందులున్న మరో ఇద్దరితో కలిసి తన ఆలోచనకు రెక్కలిచ్చాడు. విజయానికి వైకల్యం అడ్డు కాదని నిరూపించాడు.

Published : 09 Sep 2021 00:28 IST

వయసు పదిహేనేళ్లు.. పుట్టుకతోనే మానసిక సమస్యలు. అయినా కుంగిపోలేదు. తనలాగే ఇబ్బందులున్న మరో ఇద్దరితో కలిసి తన ఆలోచనకు రెక్కలిచ్చాడు. విజయానికి వైకల్యం అడ్డు కాదని నిరూపించాడు.

పిల్లాడే పశ్చిమ్‌ బంగకు చెందిన అభిరూప్‌ నాగ్‌ ప్రస్తుతం డ్రోన్‌ లైసెన్స్‌ కోసం ప్రయత్నాల్లో ఉన్నాడు. ‘ఆ.. ఇందులో అంత విశేషం ఏముందిలే!’ అని అంటారేమో.. ఆ డ్రోన్‌ను అభిరూప్‌ సొంతంగా తయారు చేశాడు మరి. అదీ హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడుతూ ఈ ప్రాజెక్టులో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు.

ముగ్గురు కలిసి..

సగ్నిక్‌ సిన్హా, జ్యోతిష్మాన్‌ బిశ్వాస్‌ అనే ఇద్దరికి కూడా అభిరూప్‌ నాగ్‌లాగే మానసిక సమస్యలున్నాయి. వీళ్లంతా ఓ పునరావాస కేంద్రంలో దాదాపు రెండేళ్లుగా వైద్యం పొందుతున్నారు. నిర్వాహకులు అక్కడున్న వారి మానసిక స్థితి, సమస్యలను బట్టి వారికి చికిత్సలో భాగంగా కొన్ని టాస్క్‌లు కేటాయించారు. ఈ ముగ్గురు డ్రోన్‌ తయారీని ఎంచుకున్నారు. తక్కువ సమయంలోనే వీళ్లు విజయవంతంగా డ్రోన్‌ను తయారు చేసి దాన్ని ఎగిరేలా చేయగలిగారు. అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయేలా సత్తా చాటారు. మొత్తానికి మన అభిరూప్‌ నాగ్‌ అదరగొట్టాడు కదూ! ఇంకెందుకాలస్యం అభినందనలు చెప్పేయండి మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని