అమ్మో.. ఎంత పెద్ద బడో!

మీ బడిలో ఎంత మంది పిల్లలు ఉంటారు? అయిదు వందలు, ఆరు వందలు, ఏడు వందలు.. పోనీ అయిదు వేలు... కానీ ఓ బడిలో మాత్రం యాభైవేలకు పైగా విద్యార్థులుంటారు. ఇదే.. ప్రపంచంలో అతిపెద్ద బడి. ‘ఆ..

Published : 24 Nov 2021 00:31 IST

మీ బడిలో ఎంత మంది పిల్లలు ఉంటారు? అయిదు వందలు, ఆరు వందలు, ఏడు వందలు.. పోనీ అయిదు వేలు... కానీ ఓ బడిలో మాత్రం యాభైవేలకు పైగా విద్యార్థులుంటారు. ఇదే.. ప్రపంచంలో అతిపెద్ద బడి. ‘ఆ.. ఆ స్కూలు ఏదో విదేశాల్లో ఉండి ఉంటుంది లే’ అని మీరనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆ పే...ద్ద బడి మన భారతదేశంలోనే ఉంది!

త్తరప్రదేశ్‌లోని లక్నోలో ‘సిటీ మాంటిస్సోరి స్కూల్‌’ ఉంది. ఇది ఇంగ్లిష్‌ మీడియం ప్రైవేటు పాఠశాల. లక్నోలో దీనికి 18 క్యాంపస్‌లున్నాయి. వీటిలో దాదాపు 56,000 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. శిశు నుంచి 12 వరకు తరగతులున్నాయి. 4,500 మంది బోధనా సిబ్బంది ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బడిగా ఇది 2019లోనే ‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోకి కూడా ఎక్కింది. ఆ సమయంలో ఈ బడిలో 55,547 మంది విద్యార్థులున్నారు.

అయిదుగురితో ప్రారంభం..

ఈ బడిని 1959లో జగదీష్‌ గాంధీ, భారతి గాంధీలు ప్రారంభించారు. అప్పుడు ఈ స్కూలులో కేవలం అయిదుగురు విద్యార్థులు మాత్రమే ఉండేవారు. అలాంటి బడి, ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. ఇంత మంది విద్యార్థులతో ఓ పాఠశాల నడుస్తోంది అంటే నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని