చేపలూ.. మనతోనే..!
హాయ్ నేస్తాలూ.. సాధారణంగా మనం కుక్కపిల్లలనో, పిల్లులనో వాకింగ్‌కు తీసుకెళ్తుంటాం. ‘మరి ఇంట్లో ముద్దుగా పెంచుకుంటున్న చేపలను బయటకు తీసుకెళ్లాలంటే?’.. ‘అలా ఎలా కుదురుతుంది.. బుజ్జి చేపలను ట్యాంకుతో సహా బయటకు పట్టుకెళ్లలేం కదా’ అని అనుకుంటున్నారా! అవును.. అది నిజమే కానీ దానికీ ఒక పరిష్కారం కనిపెట్టాడో వ్యక్తి. అదేంటో తెలుసుకుందాం రండి..
హువాంగ్ జియోజీ.. తైవాన్ దేశ రాజధాని తైపీకి చెందిన యూట్యూబర్. ఇటీవల ఒకరోజు తాను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న మూడు గోల్డ్‌ఫిష్‌లను ఒక తొట్టెలాంటి ట్రాలీలో తీసుకొని వాకింగ్‌కి వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
సొంతంగా తయారు చేసి..
కొద్దిరోజుల క్రితం ఎంతో ఇష్టమైన చేపలను ఇంట్లోనే ఒంటరిగా వదిలేయలేక.. తనతోపాటు వాకింగ్‌కు తీసుకెళ్లాలని అనుకున్నాడు హువాంగ్. అలాంటి పరికరాల కోసం అక్కడి దుకాణాలు మొత్తం తిరిగినా.. ఎక్కడా దొరకలేదు. అసలు మార్కెట్‌లోనే లేవని తెలుసుకున్నాడు. దాంతో తానే సొంతంగా ఎక్కడికైనా తీసుకెళ్లేలా ఓ అక్వేరియం తయారు చేయాలని అనుకున్నాడు.
బ్యాటరీతో..
మొదట ఓ ఆర్సిలిక్ ట్యూబ్‌ను సిద్ధం చేశాడు హువాంగ్. అందులో నీళ్లు పోసి.. బ్యాటరీ సహాయంతో ఫిల్టరేషన్ అయ్యేలా చూశాడు. చేపలకు ఆక్సిజన్ సరఫరా కోసం ఒక గాలిపుంపుతో పాటు ట్యూబ్ లోపల వెలుగుల కోసం లైట్లు కూడా ఏర్పాటు చేశాడు. ఈ మొత్తాన్ని హ్యాండిల్ ఉన్న ఒక స్టాండ్‌కు అమర్చి.. నడిపేందుకు వీలుగా రూపొందించాడు. ఇటీవల ఈ ‘మొబైల్ ఫిష్ ట్యాంక్’తో వాకింగ్‌కు వెళ్లిన హువాంగ్‌ను చూసి అందరూ నోరెళ్లబెట్టారట. తన ప్రాజెక్టు విజయవంతం కావడంతో.. దానికి మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడట. త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేస్తున్నాడితను. చేపలనూ ఎంచక్కా మనతోనే బయటకు తీసుకెళ్లే ఈ ఫిష్ ట్యాంక్ భలే ఉంది కదూ!
కంటైనర్ ఫిష్ ట్యాంక్..
గతేడాది జపాన్‌కు చెందిన ఓ కంపెనీ చేపల కోసం కంటైనర్‌లా ఉండే ఓ బ్యాగ్‌ను తయారు చేసింది. హ్యాండ్‌బ్యాగ్ లేదా రేడియో మాదిరి ఉండే దీన్ని చేతితో పట్టుకొని వాకింగ్‌కు తీసుకువెళ్లవచ్చట. అలాగనీ, అల్లాటప్పాగా అని అనుకోకండి ఫ్రెండ్స్.. ఈ ట్యాంకుకు.. లోపలున్న నీటిలో ఆక్సిజన్ శాతం కొలిచేందుకు ఓ పరికరంతోపాటు ఆహారం అందించేందుకు గొట్టం కూడా ఉంటుంది. ఎన్నో మార్పులు చేర్పుల తరవాత.. ఈ రూపు తీసుకొచ్చినట్లు సదరు సంస్థ చెబుతోంది. బరువు తక్కువ ఉండేలా.. పెద్ద చేపలకూ అనుగుణంగా ఈ ‘కంటైనర్ ఫిష్ ట్యాంక్’కు మెరుగులు దిద్దే పనిలో ఉందా సంస్థ.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్ డాలర్ల సాయం ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- social look: లవ్‌లో పడిన రష్మి.. జిమ్‌లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
- తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
- Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన యశ్వంత్‌సిన్హా పర్యటన
- Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?
- IND vs ENG: యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసిన బుమ్రా
- Raghurama: రెండేళ్ల తర్వాత భీమవరం రానున్న రఘురామ.. అభిమానుల బైక్ ర్యాలీ