పలకా పలుకవే!

ఈ పలక మీద గజిబిజిగా ఉన్న అక్షరాల్లో ఒక జీవి, ఒక పండు పేరూ దాగి ఉన్నాయి. అవి ఏంటో కనిపెట్టండి చూద్దాం.

Updated : 19 Apr 2022 04:17 IST

ఈ పలక మీద గజిబిజిగా ఉన్న అక్షరాల్లో ఒక జీవి, ఒక పండు పేరూ దాగి ఉన్నాయి. అవి ఏంటో కనిపెట్టండి చూద్దాం.


సాధించగలరా?

ఇక్కడ అగ్గిపుల్లలతో ఒక సమీకరణం ఉంది. కానీ, అది తప్పు. ఏదైనా ఒకటే పుల్లను జరిపి, దాన్ని ఒప్పు చేయగలరా?


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

1.  ససనమారోరంవ
2. లంణారుచఅ
3. లంహాచసిం
4. డురుమహనో
5. డుభానుమవుహా
6. తీదీరంన
7. మంసంరగగసా
8. తంమాహిజస
9. నోమసంకావి
10. రమషిమని


నేనెవర్ని?

1. ‘తోడేలు’లో ఉన్నాను కానీ ‘ఫిడేలు’లో లేను. ‘మరక’లో ఉన్నా, ‘మసక’లో లేను. ‘బాణం’లోనూ ఉన్నాను కానీ ‘బావి’లో లేను. ఇంతకీ నేనెవరో తెలిసిందా?
2. ‘అన్నదానం’లో ఉన్నాను.. ‘భూదానం’లో లేను. ‘వరంగల్‌’లో ఉన్నాను కానీ ‘పోర్చుగల్‌’లో మాత్రం లేను. నేనెవరో చెప్పగలరా?


తమాషా.. తమాషా..!

ఇక్కడ కొన్ని ఆధారాలున్నాయి. వాటి సాయంతో ఈ పదచక్రంలోని వృత్తాలను నింపండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.
1. విజయం
2. అలసట
3. దారిలో ఎదురయ్యేది
4. ఓ రుచి
5. తిరిగి చూసేలా చేసేది
6. ఇంటికి ఉంటుంది
7. నొప్పి
8. తెలుపు కానిది


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

గజిబిజి బిజిగజి: 1.మానససరోవరం 2.అరుణాచలం 3.సింహాచలం 4.మనోహరుడు 5.మహానుభావుడు 6.నదీతీరం 7.సాగరసంగమం 8.సమాజహితం 9.మనోవికాసం 10.మరమనిషి
తమాషా.. తమాషా!: 1.గెలుపు 2.అలుపు 3.మలుపు 4.పులుపు 5.పిలుపు 6.తలుపు 7.సలుపు 8.నలుపు

నేనెవర్ని : 1.తోరణం 2.అన్నవరం

పలకా పలుకవే : MANGO,OWL

కవలలేవి : a, d

  సాధించగలరా :


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని