అది ఏది?

Updated : 24 May 2023 05:08 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘సందేశం’లో ఉంటాను కానీ ‘విదేశం’లో లేను. ‘ఘనం’లో ఉంటాను కానీ ‘వనం’లో లేను. ‘వర్ష’లో ఉంటాను కానీ ‘వర్షం’లో లేను. ‘అరుణ’లో ఉంటాను కానీ ‘అరుణ్‌’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను అయిదక్షరాల పదాన్ని. ‘పటం’లో ఉంటాను కానీ ‘ఘటం’లో లేను. ‘చెద’లో ఉంటాను కానీ ‘చెర’లో లేను. ‘విల్లు’లో ఉంటాను కానీ ‘హల్లు’లో లేను. ‘నోరు’లో ఉంటాను కానీ ‘జోరు’లో లేను. ‘బాదం’లో ఉంటాను కానీ ‘బాణం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


చెప్పుకోండి చూద్దాం

1. తెల్లని సువాసనల మొగ్గ. ఎర్రగా పూసి మాయమై పోతుంది. ఏమిటది?

2. ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే!

ఏంటో చెప్పుకోండి చూద్దాం?

3. ఒక దూలానికి నలుగురు దొంగలు. ఏంటో తెలుసా?

4. ముఖం లేకున్నా.. బొట్టు పెట్టుకుంటుంది. ఏంటది?


ఆ పదాలేంటి?

అయిదు పదాల్లోని అక్షరాలన్నీ ఇక్కడ వరసగా ఉన్నాయి. ప్రతి పదంలో ఉండే ఒక అక్షరం, ఇక్కడ మాత్రం లేదు. ఆ అక్షరంతోపాటు పదాలనూ మీరు కనిపెట్టగలరా?

ROGWOLOXLOWERINGER


జవాబులు

రాయగలరా!

1.కర్మఫలం 2.కాలిబాట 3.తోటమాలి 4.పెద్దపులి 5.చిరపుంజి 6.ఎండు ద్రాక్ష 7.పంటకాలువ 8.పరిశ్రమ 9.విషమ పరీక్ష  10.వ్యాపారవేత్త 11.ఎలుగుబంటి 12.అన్నదానం 13.చిరుధాన్యాలు 14.నీలిమేఘం 15.అనుకరణ

అక్షరాల చెట్టు: DISAPPOINTMENT 

బొమ్మల్లో ఏముందో!: 1.జలపాతం 2.పావురాయి 3.రాబందు 4.దున్నపోతు 5.కవాతు

నేనెవర్ని?: 1.సంఘర్షణ 2.పదవినోదం

అది ఏది? : 3  

ఆ పదాలేంటి?: FROG, WOLF, FOX, FLOWER, FINGER 

పొడుపు కథలు!: 1.కర్పూరం 2.ఆవలింత 3.లవంగం 4.గడప

తప్పులే తప్పులు: 1.అవగాహన 2.ప్రతిబింబం 3.అంతర్యుద్ధం 4.కాలచక్రం 5.పద్యభాగం 6.జనసందోహం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని