అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 10 Jan 2024 06:57 IST

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


పద వలయం

కింద ఇచ్చిన ఆధారాలతో ఖాళీ గడులను పూరించండి. అన్ని పదాలు ‘స’ అక్షరంతోనే మొదలవుతాయి.
1. మొత్తం 2. సరి - - - 3. చెరువు కన్నా పెద్దది
4. ఇబ్బంది 5. సమావేశం మరోలా 6. కాలం
7. సన్మానం 8. అన్నీ వదిలేసిన వ్యక్తి


క్విజ్‌.. క్విజ్‌..!

1. ప్రపంచంలో అతిపెద్ద గుహ ఏ దేశంలో ఉంది?
2. మేరీకోమ్‌ ఏ క్రీడకు చెందిన వ్యక్తి?
3. ఏ దేశంలో ఎక్కువగా చాక్లెట్‌ను ఉపయోగిస్తారు?
4. మిక్కీమౌస్‌ను ఏ సంస్థ సృష్టించింది?
5. ముక్కుకు సంబంధించిన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
6. చంద్రుడి మీద మొదటిసారి తిన్న పండు ఏది?
7. గర్బా నృత్యం మన దేశంలో ఏ రాష్ట్రానికి చెందినది?
8. పుట్టినరోజున కేక్‌ కట్‌ చేసే సంప్రదాయాన్ని పరిచయం చేసిన దేశం ఏది?


నేనెవర్ని?

1. నేనో మూడక్షరాల పదాన్ని. ‘సంత’లో ఉంటాను. ‘పుంత’లో ఉండను. ‘గీటు’లో ఉంటాను. ‘గాటు’లో ఉండను. ‘గతం’లో ఉంటాను. ‘గళం’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?
2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘తెప్ప’లో ఉంటాను. ‘కప్ప’లో ఉండను. ‘రవి’లో ఉంటాను. ‘కవి’లో ఉండను. ‘చారు’లో ఉంటాను. ‘కారు’లో ఉండను. ‘పది’లో ఉంటాను. ‘మది’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో తెలుసా?

 


చెప్పుకోండి చూద్దాం

ఇక్కడి ఖాళీ గడులను సరైన పదాలతో పూరిస్తే, సామెతలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి మరి.


పదాలేవి?

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటి సమానార్థకాలు మాత్రం ఆంగ్లంలో అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని పూర్తి చేయండి చూద్దాం.


జవాబులు

అక్షరాల రైలు: EQUIPMENT

పదాలేవి?: 1.LADDER 2.ODD 3.GRAMMAR 4.COMMAND 5.CHESS 6.CONFESS 7.ATTITUDE 8.BITTER

బొమ్మల్లో ఏముందో?: 1.కొవ్వొత్తి 2.కొలను 3.నులకమంచం 4.మందారపువ్వు 5.చిరుతపులి 6.రుమాళ్లు

పద వలయం: 1.సర్వస్వం 2.సమానం 3.సరస్సు 4.సమస్య 5.సదస్సు 6.సమయం 7.సత్కారం 8.సన్యాసి

ఏది భిన్నం?: 2

చెప్పుకోండి చూద్దాం: 1.జోరీగ 2.పిల్ల 3.శంఖం 4.కొండలైనా 5.అప్పు

క్విజ్‌.. క్విజ్‌..!: 1.వియత్నాం 2.బాక్సింగ్‌ 3.స్విట్జర్లాండ్‌ 4.వాల్ట్‌ డిస్నీ 5.రైనాలజీ 6.పీచ్‌ ఫ్రూట్‌ 7.గుజరాత్‌ 8.జర్మనీ

నేనెవర్ని?: 1.సంగీతం 2.తెరచాప


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు