ఇవి పెద్ద గులాబ్‌ జామూన్‌లు!

ఛత్తీస్‌గఢ్‌ వాసులు ఇష్టంగా తినే వంటల్లో ‘దెహరోరీ’ ఒకటి. దీన్నెలా చేయాలంటే.. బియ్యప్పిండి, నూనె, పెరుగు, పంచదారలు ఒక కప్పు చొప్పున, కొద్దిగా బేకింగ్‌ సోడా, రెండు చెంచాల ఉప్మా రవ్వ, అర చెంచా యాలకులు తీసుకోండి.

Published : 21 Jan 2024 00:04 IST

ఛత్తీస్‌గఢ్‌ వాసులు ఇష్టంగా తినే వంటల్లో ‘దెహరోరీ’ ఒకటి. దీన్నెలా చేయాలంటే.. బియ్యప్పిండి, నూనె, పెరుగు, పంచదారలు ఒక కప్పు చొప్పున, కొద్దిగా బేకింగ్‌ సోడా, రెండు చెంచాల ఉప్మా రవ్వ, అర చెంచా యాలకులు తీసుకోండి. ఒక పాత్రలో బియ్యప్పిండి, ఉప్మా రవ్వ, బేకింగ్‌ సోడా, యాలకుల పొడి, పెరుగు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొన్ని నీళ్లు చేర్చవచ్చు. కానీ పిండి జారుగా ఉండకూడదు. ఈ మిశ్రమాన్ని నాలుగు గంటలు నాననివ్వాలి. ఈలోగా పంచదారలో నీళ్లు పోసి పాకం తయారుచేయాలి. ఇందులో రెండు మూడు యాలకులు వేయాలి. కడాయిలో నూనె కాగనివ్వాలి. బియ్యప్పిండి మిశ్రమాన్ని గరిటెతో తీసి కాగుతున్న నూనెలో బజ్జీల్లా వేసి.. బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. ఆ వెంటనే వాటిని పంచదార పాకంలో వేయాలి. ఇవి కొంచెం గులాబ్‌ జామూన్‌లను తలపిస్తాయి. ఎక్కువ వెగటనిపించకుండా, కాస్త తీపితో ఎంతో రుచిగా ఉంటాయి. నచ్చితే మీరూ ఒకసారి ఈ ‘దెహరోరీ’ చేసి చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని