ఎంతో సులువుగా రోజ్‌ ఖర్వాస్‌!

మహారాష్ట్రవారి ‘రోజ్‌ ఖర్వాస్‌’ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని బయట కొనే బదులు ఇంట్లోనే చేసుకుంటే మరింత తృప్తిగా ఉంటుంది కదూ! ఈ మిఠాయికి మిల్క్‌ పౌడర్‌, ఫుల్‌ఫ్యాట్‌ మిల్క్‌, కండెన్స్‌డ్‌ మిల్క్‌, పెరుగు..

Updated : 28 Apr 2024 12:05 IST

మహారాష్ట్రవారి ‘రోజ్‌ ఖర్వాస్‌’ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని బయట కొనే బదులు ఇంట్లోనే చేసుకుంటే మరింత తృప్తిగా ఉంటుంది కదూ! ఈ మిఠాయికి మిల్క్‌ పౌడర్‌, ఫుల్‌ఫ్యాట్‌ మిల్క్‌, కండెన్స్‌డ్‌ మిల్క్‌, పెరుగు.. అన్నీ ఒక్కో కప్పు చొప్పున, యాలకుల పొడి చెంచా, పంచదార, ఎండిన గులాబీ రేకలు ముప్పావు కప్పు చొప్పున, రోజ్‌ సిరప్‌ కొద్దిగా తీసుకోవాలి.

ఎలా చేయాలంటే... మిల్క్‌ పౌడర్‌, ఫుల్‌ఫ్యాట్‌ మిల్క్‌, కండెన్స్‌డ్‌ మిల్క్‌, పెరుగు, పంచదారలను మిక్సింగ్‌ గిన్నెలో వేసి ఉండలు కట్టకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని కేక్‌ పాన్‌లోకి తీసి.. పైన యాలకుల పొడి, ఎండిన గులాబీ రేకులు వేయండి. స్టీమింగ్‌ పాన్‌ లేదా ఇడ్లీ కుక్కర్లో 30 నుంచి 35 నిమిషాలు మీడియం సెగ మీద ఉడికించండి. ఉడికిందో లేదో తెలియడానికి కత్తి లేదా స్పూన్‌ వెనుకభాగంతో చెక్‌ చేయండి. పదార్థం అంటుకోలేదంటే చక్కగా ఉడికినట్టు. లేదంటే ఇంకో రెండు నిమిషాలు ఉడికించి, దించేయండి. చల్లారాక ఓ గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచండి. బయటకు తీశాక.. నచ్చిన ఆకృతిలో కట్‌ చేయండి. చల్లటి ‘రోజ్‌ ఖర్వాస్‌’ ఆస్వాదించండి!

పవన్‌ సిరిగిరి, చెఫ్‌, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని