కుకుంబర్‌ సుశి రోల్స్‌ సూపరః

జపాన్‌ వాళ్ల వంటలు రుచిగానూ ఉంటాయి, ఆరోగ్యాన్నీ అందిస్తాయి. వాటిల్లో కొన్ని మనమూ తేలిగ్గా చేసుకోవచ్చు. అలాంటి చిరుతిండే కుకుంబర్‌ సుశి రోల్స్‌.

Published : 12 May 2024 00:39 IST

జపాన్‌ వాళ్ల వంటలు రుచిగానూ ఉంటాయి, ఆరోగ్యాన్నీ అందిస్తాయి. వాటిల్లో కొన్ని మనమూ తేలిగ్గా చేసుకోవచ్చు. అలాంటి చిరుతిండే కుకుంబర్‌ సుశి రోల్స్‌. ఇవి చేసేందుకు వెదురుతో చేసిన సుశి మ్యాట్‌ అవసరమవుతుంది. అన్నం 400 గ్రాములు, ఒక కీరదోసకాయ, మూడు నోరి షీట్స్‌, టేబుల్‌స్పూన్‌ రైస్‌ వెనిగర్‌, అర టేబుల్‌ స్పూన్‌ పంచదార, రుచికి తగినంత ఉప్పు సిద్ధంగా ఉంచుకోవాలి.

 ఎలా చేయాలంటే.. రైస్‌ వెనిగర్‌లో ఉప్పు, పంచదార వేసి బ్లెండ్‌ చేయాలి. వండిన అన్నాన్ని వెడల్పయిన పాత్రలోకి తీసి.. ఈ వెనిగర్‌ను కొద్దికొద్దిగా అన్నంలో వేసి కలపాలి. ఈ పాత్ర మీద శుభ్రమైన పొడి వస్త్రాన్ని కప్పాలి. నోరి షీట్స్‌ను వాటి మీద ఉన్న గుర్తుల ప్రకారం కత్తిరించాలి. కీరదోస కాయను తల, తొడిమల దగ్గర కాస్త తీసేసి.. పొడుగ్గా.. ఆరు సమానమైన భాగాలుగా కోయాలి. సుశి మ్యాట్‌ మీద నోరి షీట్‌ను ఉంచి.. దాని మీద కొద్దిగా అన్నం పరిచినట్లు సమంగా సర్దాలి. చేతిని నీళ్లలో ముంచి తడి చేసుకుంటే అన్నం అంటదు. మధ్యలో ఒక కీరదోస ముక్కను ఉంచి.. జాగ్రత్తగా సుశి మ్యాట్‌ను నోరి షీట్‌తో సహా రోల్‌ చేయాలి. మ్యాట్‌ను వెనక్కి తీసేస్తే నోరి షీట్‌ చక్కగా చుట్టుకుని ఉంటుంది. ఒక్కో రోల్‌ను చాకుతో ఆరు సమాన భాగాలు చేయాలి. వీటి మీద కొన్ని నువ్వులు చల్లి.. సోయాసాస్‌లో ముంచి తింటే సూపర్‌గా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని