కళింగపండుతో నోరూరేలా..

ఒడిశా రాష్ట్రంలో ప్రసిద్ధ వంటకం ఓవ్‌ ఖటా. కళింగ పండుతో (ఎలిఫెంట్‌ యాపిల్‌) చేసే ఈ శాకాహార పదార్థం ఒడిశా వాసులకు మహా ఇష్టం.

Updated : 06 Aug 2023 01:21 IST

డిశా రాష్ట్రంలో ప్రసిద్ధ వంటకం ఓవ్‌ ఖటా. కళింగ పండుతో (ఎలిఫెంట్‌ యాపిల్‌) చేసే ఈ శాకాహార పదార్థం ఒడిశా వాసులకు మహా ఇష్టం. ఇందులో సి విటమిన్‌ విస్తారంగా ఉంటుంది కనుక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జిగురు, బంక లేకుండా కొంచెం తియ్యగా, కొంచెం పుల్లగా ఉంటుంది. ఇది అన్నం, రొట్టెలు.. ఎందులోనైనా బాగుంటుంది. ఇంతకీ ఓవ్‌ ఖటా ఎలా చేయాలంటే.. కడాయిలో తాలింపు దినుసులు వేగిన తర్వాత చెక్కు తీసి సన్నగా, పొడుగ్గా తరిగి ఉడికించిన పెద్ద కళింగ పండు ముక్కలు, అల్లం ముద్ద, ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు, బెల్లం వేసి మూతపెట్టాలి. రెండు నిమిషాల తర్వాత కొబ్బరికోరు, జీలకర్ర పొడి వేసి దించేస్తే సరి రుచికరమైన ఓవ్‌ ఖటా సిద్ధం. కమలా, నిమ్మ, ద్రాక్ష తదితర పండ్లతో చేసినట్లు ఈ కళింగపండ్లను పంచదారతో ఉడికించి మార్మలేడ్‌ కూడా తయారుచేస్తారు. ఇది నిలవుంటుంది కనుక పండ్లు దొరకని కాలంలోనూ ఆరోగ్యం కోసం తింటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని