మిర్చి పచ్చడే మరోలా..

రోటి పచ్చడి పేరుచెబితే చాలు మనందరికీ నోరూరుతుంది కదూ! వంకాయ, దోసకాయ లాంటి పచ్చళ్లు ఇష్టంగా తింటాం. ఇక పచ్చిమిర్చి గురించి చెప్పాల్సిందేముంది.. చాలా నచ్చేస్తుంది

Published : 20 Aug 2023 01:33 IST

రోటి పచ్చడి పేరుచెబితే చాలు మనందరికీ నోరూరుతుంది కదూ! వంకాయ, దోసకాయ లాంటి పచ్చళ్లు ఇష్టంగా తింటాం. ఇక పచ్చిమిర్చి గురించి చెప్పాల్సిందేముంది.. చాలా నచ్చేస్తుంది. కానీ మిర్చితో చేస్తే ఆ మంట నసాళానికి అంటుతుంది. అంత ఘాటు తట్టుకోలేం.. కొంచెం తగ్గాలంటే ఇలా ప్రయత్నించండి.. ఇది చేయాలంటే.. పావు లేత పచ్చిమిరప కాయలకు అంతే తూకంలో చింతపండు, ఉప్పు, వెల్లుల్లి, కరివేపాకు, చిక్కటి పుల్లమజ్జిగ, తాలింపు దినుసులు, నూనె ఉంటే సరిపోతుంది. కడాయిలో నూనె కొద్దిగా కాగాక పచ్చిమిర్చి వేసి వెంటనే మజ్జిగ పోయాలి. సన్న సెగ మీద మజ్జిగను ఇంకనివ్వాలి. పొయ్యి కట్టేసి చల్లారాక నానపెట్టిన చింతపండు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు జతచేసి గ్రైండ్‌ చేసి, తాలింపు వేస్తే సరి ఘుమఘుమలాడే మజ్జిగ మిర్చి పచ్చడి సిద్ధం. మజ్జిగ మరగడం వల్ల ప్రత్యేకమైన రుచి వస్తుంది, కారం కూడా తగ్గుతుంది. ఇది అన్నం, దోశ, చపాతీ, పునుగులు.. ఎందులోకైనా బాగుంటుంది.

జాన్సీలక్ష్మి జాలాది ,హైదరాబాద్ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని