కీరాతో సూపర్‌ పచ్చడి

దోసకాయతో పచ్చడి చేస్తాం కదా.. కీర దోసతో ఎందుకు చేయకూడదు- అనిపించింది. అదేం అరుదైన కూరగాయ కాదు.. మా అత్తగారికి చలవచేస్తుందని, పిల్లలకు ఫేస్‌ ప్యాక్‌ వేసుకోవడానికి కావాలని.. ఇంట్లో ఎప్పుడూ దండిగా ఉంటాయి.

Updated : 12 Oct 2023 18:31 IST

దోసకాయతో పచ్చడి చేస్తాం కదా.. కీర దోసతో ఎందుకు చేయకూడదు- అనిపించింది. అదేం అరుదైన కూరగాయ కాదు.. మా అత్తగారికి చలవచేస్తుందని, పిల్లలకు ఫేస్‌ ప్యాక్‌ వేసుకోవడానికి కావాలని.. ఇంట్లో ఎప్పుడూ దండిగా ఉంటాయి. ఆలోచన వచ్చాక.. ఇంకెందుకాలస్యం.. అనుకుని వెంటనే ప్రయత్నించా..  దీన్నెలా చేయాలంటే.. రెండు కీర దోసకు, ఎనిమిది పచ్చి మిరపకాయలు, అర నిమ్మ పండంత చింతపండు, అర కప్పు నువ్వులు, కాస్త కొబ్బరి, తగినంత ఉప్పు, నూనె, తాలింపు దినుసులు, ఇంగువ, రెండు రెబ్బల కరివేపాకు సిద్ధం చేసుకున్నాను. కీర దోస ముక్కలు, సన్నగా తరిగిన కొబ్బరి, వేయించిన నువ్వులు, పచ్చి మిర్చి, ఉప్పు, చింతపండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. వెల్లుల్లి ఇష్టపడేవారు దాన్ని కూడా జతచేయొచ్చు. కడాయిలో నూనె వేడయ్యాక.. ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు ఒక్కొక్కటిగా వేసి ఎర్రగా వేయించి, పచ్చడిలో కలిపేస్తే సరిపోతుంది. త్వరగా, సులువుగా చేసేయొచ్చు. దీని భిన్నమైన రుచి ఆకట్టుకుంటుంది. అన్నంలోకీ, రొట్టెల్లోకీ కూడా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికెంతో మంచిది. కీరా ముక్కలుగా వద్దనే పిల్లలు ఈ రూపంలో ఇష్టంగా తింటారు.

చుండూరి ఉదయశ్రీ, బౌరంపేట్‌, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని