ఆవకాయ కోసం గాలించేశారు..

ఇవాళ్టి రోజున అమ్మమ్మ, నాన్నమ్మల దగ్గర వంటలు నేర్చుకోవాల్సిన పని లేదు. సంప్రదాయ వంటల నుంచి జంక్‌ ఫుడ్‌ వరకూ ఏదైనా నెట్‌లో దొరికేస్తుంది.

Updated : 17 Dec 2023 03:18 IST

ఇవాళ్టి రోజున అమ్మమ్మ, నాన్నమ్మల దగ్గర వంటలు నేర్చుకోవాల్సిన పని లేదు. సంప్రదాయ వంటల నుంచి జంక్‌ ఫుడ్‌ వరకూ ఏదైనా నెట్‌లో దొరికేస్తుంది. ఈ తరం అమ్మాయిలు అంతర్జాలంలో చూసి ఆవకాయ పచ్చడి కూడా భేషుగ్గా పట్టేస్తున్నారు. అందుకు నిదర్శనమే ఈ ఏడాది గూగుల్‌ సెర్చ్‌లో మామిడికాయ పచ్చడి ఇండియాలో ‘మోస్ట్‌ సెర్చ్‌డ్‌ రెసిపీ’గా నిలిచింది. తర్వాతి స్థానంలో ఉగాది పచ్చడి, రవ్వలడ్డు, పంచామృతం, ధనియా పంజీరీ, కరంజీ, కోలుకుట్టయి వంటకాలున్నాయి. ఉగాది పచ్చడి కోసం మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో.. ముఖ్యంగా మిర్యాలగూడ, ధర్మవరం, మరూర్‌, ఆదిలాబాద్‌, నల్గొండల్లో ఎక్కువ వెతికారు. నవంబరు మొదటి వారంలో దీపావళి సందర్భంగా రవ్వలడ్డు కోసం ఆంధ్రప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో వెతికారు. ఇక మన ప్రియమైన ఆవకాయ పచ్చడి గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, దాద్రా, నగర్‌ హవేలీ, గోవాల్లోనూ విపరీతంగా గాలించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని