మిరియాల ఘాటే వేరయా!

రోజూ తాగే చాయ్‌లో కాస్తంత మిరియాల పొడి వేశామంటే.. కొంచెం తియ్యగా, కొంచెం ఘాటుగా భలే ఉంటుంది. క్యాలీఫ్లవర్‌ కూరలో అర చెంచా పెప్పర్‌ చల్లామంటే.. ఆ రుచికి రెండు ముద్దలు ఎక్కువ తినేస్తాం

Published : 17 Dec 2023 00:46 IST

రోజూ తాగే చాయ్‌లో కాస్తంత మిరియాల పొడి వేశామంటే.. కొంచెం తియ్యగా, కొంచెం ఘాటుగా భలే ఉంటుంది. క్యాలీఫ్లవర్‌ కూరలో అర చెంచా పెప్పర్‌ చల్లామంటే.. ఆ రుచికి రెండు ముద్దలు ఎక్కువ తినేస్తాం. పొంగలి, దద్ధ్యోదనం లాంటివి అంత టేస్టీగా ఉంటాయంటే.. అదంతా మిరియాల చలవే. చాలా వంటకాల్లో పెప్పర్‌.. పెద్దక్కయ్య పాత్ర ధరించేసి బ్రహ్మాండమైన రుచి తెప్పిస్తుంది. ఇక ఆరోగ్యం చేకూర్చడంలో అయితే.. మనల్ని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండే అమ్మలా అనిపిస్తుంది. ఇంతకీ మిరియాల వల్ల ఎన్నెన్ని లాభాలున్నాయో తెలుసా.. జలుబు, దగ్గుల నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. హానిచేసే సూక్ష్మ క్రిములను నశింపచేసి, మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి. ఇవి పదార్థాలకు ప్రత్యేక వాసన, రుచి ఇస్తాయి. ఆకలి పెంచుతాయి. రక్తంలో చక్కర స్థాయిని, కొలెస్ట్రాల్‌ లెవెల్‌ని తగ్గిస్తాయి. ఎలర్జీలు, క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. పోషకాలను గ్రహించడంలో తోడ్పడతాయి. చర్మం, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. రోజంతా ఉల్లాసంగా, హుషారుగా ఉంటుంది. వీటిల్లో ఉండే యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు- నొప్పి, వాపు లాంటి ఇబ్బందులను నివారిస్తాయి. నిజంగా ఔషధమే కదూ! ఇంత మేలు చేసే మిరియాలను ఏదో రూపంలో తరచూ తిందాం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని