రసం పొడి ఇలా చేయండి!

మనలో చాలా మందికి పప్పు చారు అంటే ఎంత ఇష్టమో రసం కూడా అంతే ఇష్టం. ముఖ్యంగా తమిళుల రసం మరీ మరీ బాగుంటుంది.

Published : 18 Feb 2024 00:03 IST

మనలో చాలా మందికి పప్పు చారు అంటే ఎంత ఇష్టమో రసం కూడా అంతే ఇష్టం. ముఖ్యంగా తమిళుల రసం మరీ మరీ బాగుంటుంది. అయితే రసం పౌడర్‌ బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. ఏమేం కావాలంటే.. కందిపప్పు, శనగపప్పు, జీలకర్ర, మిరియాలు పావు కప్పు చొప్పున, ధనియాలు అర కప్పు, ఏడెనిమిది ఎండు మిరపకాయలు, ఇంగువ, పసుపు చెంచా చొప్పున తీసుకుంటే  పావు కిలో రసం పొడి తయారవుతుంది.

ఎలా చేయాలంటే.. ముందుగా శనగ, కందిపప్పులను వేయించి తీయాలి. అదే కడాయిలో ధనియాలు వేయించాలి. అవి తీసి జీలకర్ర, తర్వాత మిరియాలు వేయించాలి. ఆ తర్వాత  మిరపకాయలు, కరివేపాకు కలిపి వేయించాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వేయించి.. చల్లారాక మిక్సీ జార్‌లో వేయాలి. వాటికి ఇంగువ, పసుపు జతచేసి గ్రైండ్‌ చేయాలి. అంతే రసం పొడి తయారైపోతుంది. దీన్ని తడి లేని, గాలి చొరబడని సీసాలో నిలవ చేసుకుంటే.. క్షణాల్లో ఘుమఘుమలాడే రసం చేసుకోవచ్చు. రసం నోటికి హితవుగానూ ఉంటుంది, తిన్నది తేలిగ్గా జీర్ణమవుతుంది కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని