చుక్కలన్నీ మూట కట్టి..

చుక్కలన్నీ మూట కట్టి.. నీ చేతిలో పెడదామనుకున్నా... కానీ ఆ చుక్కలన్నీ ధర్నా చేసి.. నీకు మించిన చక్కని చుక్క లేదన్నాయి... సప్త సాగరాల్లో అలల్ని బంధించి నీకందిద్దాం అనుకున్నా... ఆ అలలన్నీ అలిగి మాయమయ్యాయి నీ నవ్వు అనే తీరం తాకి!

Updated : 10 Feb 2024 00:26 IST

చుక్కలన్నీ మూట కట్టి.. నీ చేతిలో పెడదామనుకున్నా... కానీ ఆ చుక్కలన్నీ ధర్నా చేసి.. నీకు మించిన చక్కని చుక్క లేదన్నాయి... సప్త సాగరాల్లో అలల్ని బంధించి నీకందిద్దాం అనుకున్నా... ఆ అలలన్నీ అలిగి మాయమయ్యాయి నీ నవ్వు అనే తీరం తాకి! సప్త స్వరాలనూ బుజ్జగించి నీ పరం చేద్దామనుకున్నా! ఆ స్వరాలన్నీ గట్టిగా ఏడ్చి చెప్పాయి.. నీ మాట కన్నా గొప్ప స్వరం ఏదీ లేదనీ! కోటి మల్లెలు గుదిగుచ్చి నీకు కానుకగా ఇద్దామనుకున్నా... ఆ పువ్వులన్నీ నీ కాలి స్పర్శతో చిరునవ్వులుగా మారిపోయాయి! చివరిగా భూమిలోంచి బంగారం వెలికితీసి నీకు వరంగా ఇద్దామనుకున్నా... తీరా భూమి మీద నిన్ను మించిన బంగారం ఏదీ లేదని తెలుసుకున్నా! ఆఖరికి ‘ఐలవ్యూ బంగారం’ అని చెబితేనే నువ్వు నా సొంతమవుతావని నీ ముందుకొచ్చా.

 జగన్‌ త్రివిక్రమ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని