‘యువ’ నీరసం

ఆఫీసులో ఎవరి సందడి ఎక్కువగా ఉంటుంది?.. యువ ఉద్యోగులది. వేగంగా పని చేస్తూ ఉత్పాదకత పెంచేది ఎవరు?.. యువ ఉద్యోగులే. మరి అనారోగ్యం సాకుగా చూపి అత్యధిక సెలవులు పెట్టేది ఎవరంటే..?

Published : 02 Mar 2024 00:08 IST

ఆఫీసులో ఎవరి సందడి ఎక్కువగా ఉంటుంది?.. యువ ఉద్యోగులది. వేగంగా పని చేస్తూ ఉత్పాదకత పెంచేది ఎవరు?.. యువ ఉద్యోగులే. మరి అనారోగ్యం సాకుగా చూపి అత్యధిక సెలవులు పెట్టేది ఎవరంటే..? అదీ యువ ఉద్యోగులే అన్నది సమాధానం. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఎందుకిలా అంటే మాత్రం మానసిక సమస్యలు అన్నది సమాధానం. ముఖ్యంగా కొవిడ్‌ తదనంతరం.. ఒత్తిడి, ఆందోళన, అనారోగ్యాలతో సిక్‌ లీవులు పెట్టే ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందట. ఇందులోనూ అమ్మాయిల సంఖ్యే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి ఉంది. ప్రతి ముగ్గురిలో ఒకరు కామన్‌ మెంటల్‌ డిజార్డర్‌తో బాధ పడుతున్నారట. దీంతోపాటు.. సీనియర్లతో పోలిస్తే.. మేం సరిగా పని చేయలేకపోతున్నాం అని 33శాతం యువ ఉద్యోగులు స్వయంగా చెబుతున్నారు. థింక్‌టాంక్‌ రిజల్యూషన్‌ ఫౌండేషన్‌ అధ్యయనంలో ఈ విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని