రేయ్‌.. ఎవర్రా మీరంతా?

ఇంటర్‌ పూర్తిచేసి ఇంజినీరింగ్‌ కాలేజీలో చేరిన రోజులవి. తరగతిలో అడుగు పెడుతున్న మొదటి సారే ఎందుకో.. ఏదో తేడాగా ఉందేంటి? అనిపించింది.

Published : 30 Mar 2024 00:04 IST

ఏదో సరదాకి

ఇంటర్‌ పూర్తిచేసి ఇంజినీరింగ్‌ కాలేజీలో చేరిన రోజులవి. తరగతిలో అడుగు పెడుతున్న మొదటి సారే ఎందుకో.. ఏదో తేడాగా ఉందేంటి? అనిపించింది. వెళ్లి ముందుబెంచీలో కూర్చోబోతుంటే.. ‘నీ ర్యాంకేంటి?’ అని ఒకడు అడగడంతో చదువుకోవాలన్న నా మూడ్‌, ఉత్సాహం సర్వనాశనం అయిపోయాయి. పుస్తకాలు తప్ప బయటి ప్రపంచం బొత్తిగా తెలియని వాళ్లని గమనిస్తే కొన్నిసార్లు రేయ్‌.. ఎవర్రా మీరంతా? అని అరవాలనిపించేది. చూస్తుండగానే సెమిస్టర్‌ పరీక్షలు మొదలయ్యాయి. ఆరోజు ఎమ్‌3 ఎగ్జామ్‌. ప్రశ్నాపత్రం చూడగానే ఇదేందయ్యా ఇది.. ఇది నేను ఎప్పుడూ చూడలా అనేలా చదివింది ఒక్కటీ రాలేదు. సరెసర్లే ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటీ? అనుకుంటుండగా.. పరీక్షా కేంద్రంలోకి ఒక అతిలోక సుందరి వచ్చింది. చూపు తిప్పుకోలేని ఆ అందంపై అబ్బాయిలందరి కళ్లూ పడ్డాయి. అక్కడ నాకు స్పేస్‌ లేదు.. అయినా క్రియేట్‌ చేసుకున్నా. పరీక్ష అయిపోగానే ఎలాగైనా తన గురించి తెలుసుకోవాలనుకున్నా. కష్టపడ్డా.. ప్రతి వీధిలో పాలమ్మినా.. పూలమ్మినా.. పేపర్‌ వేసినా.. మొత్తానికి తన చిరునామా కనుక్కున్నా. పరిచయం చేసుకున్నా. స్నేహం పెంచుకున్నా. దగ్గరయ్యా. ఓరోజు కలుద్దామని చెబితే వెళ్లా. ఒకడిని చూపిస్తూ.. ‘ఇతడే నా బాయ్‌ఫ్రెండ్‌’ అంటూ పరిచయం చేసింది. ‘మా పెద్దలు ఒప్పుకోవడం లేదు. నువ్వే మమ్మల్ని ఎలాగైనా కలపాలి’ అంది. ఆ ఒక్కమాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని ఎక్కడికి వెళ్లిపోయానో నాకే తెలియదు. ప్రస్తుతం తనని మర్చిపోలేక బంగారం ఒక్కటి చెప్పనా.. అని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేసుకుంటున్నా.

ఎస్‌.శివవరప్రసాద్‌,యాదాద్రి భువనగిరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని