ఆ కాలును మడతపెట్టీ...!

‘ఆ కుర్చీని మడతపెట్టి..’ అనే పాట నిన్నటిదాకా కుర్రకారుని ఊపేసింది. ఇప్పుడు ‘నీ కాలుని మడతపెట్టి..’ అనే ఛాలెంజ్‌ అంతర్జాలాన్ని చుట్టేస్తోంది.

Published : 25 May 2024 00:17 IST

‘ఆ కుర్చీని మడతపెట్టి..’ అనే పాట నిన్నటిదాకా కుర్రకారుని ఊపేసింది. ఇప్పుడు ‘నీ కాలుని మడతపెట్టి..’ అనే ఛాలెంజ్‌ అంతర్జాలాన్ని చుట్టేస్తోంది. ఇదొక ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌. సింగిల్‌ లెగ్‌ స్క్వాట్‌లా ఉండే ఈ వ్యాయామంలో ఒక కాలును మడతపెట్టి పైకి లేవడం చాలా కష్టమంటున్నారు ఫిట్‌నెస్‌ గురూలు. వివరాల్లోకి వెళ్తే..

ఏంటీ ఛాలెంజ్‌?: ఇది ఒక వ్యక్తి శరీరం బ్యాలెన్స్, స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీని సూచించే సవాలు. ఒకే కాలుతో చేసే స్క్వాట్‌ వర్కవుట్‌లా ఉంటుంది. 
ఎలా చేయాలి?: ముందు నిటారుగా నిల్చోవాలి. ఏదైనా ఒక కాలును బాగా వెనక్కి చాచాలి. వెనక్కి చాచిన ఆ కాలుని చేత్తో పట్టుకొని, మోకాలుపై మడిచి నేలకు ఆనించి పైకి లేవాలి.
కష్టమే: ఇలా చేయడం చెప్పినంత తేలిక కాదండోయ్‌. ఎంతో ఎంతో సాధన, ఒడుపు ఉంటేగానీ దీన్ని చేయడం అందరివల్లా కాదు. అందుకే ఈ ఛాలెంజ్‌ అంతర్జాలాన్ని ముంచెత్తుతోంది. 
లాభాలు: తొడలు, పిరుదులు, స్నాయువు, లోయర్‌బాడీకి మంచి వ్యాయామం. నడుము కిందిభాగంలోని కండరాలు దృఢమవుతాయి. తరచూ చేస్తుంటే శరీరం నియంత్రణలో ఉంటుంది. తుంటి కదలికలు సాఫీగా ఉంటాయి. 
సాఫీగా చేస్తేనే..: అయితే ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా.. కండరాలు పట్టేయడం.. గాయాల పాలవడమూ ఉంటాయి. అందుకే బాగా ప్రాక్టీస్‌ చేశాకే ప్రయత్నించాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని