దేశంలో మరో 2.58 లక్షల మందికి కొవిడ్‌

దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 2,58,089 కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యం విషమించి మరో 385 మంది బాధితులు కన్నుమూశారు. దీంతో మొత్తం కొవిడ్‌

Published : 18 Jan 2022 05:01 IST

19.65 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు

దిల్లీ: దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 2,58,089 కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యం విషమించి మరో 385 మంది బాధితులు కన్నుమూశారు. దీంతో మొత్తం కొవిడ్‌ కేసులు 3,73,80,253కు, మరణాలు 4,86,451కి చేరాయి. మరోవైపు, జన్యు పరీక్షల్లో తేలిన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8,209కి పెరిగాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 1,738, పశ్చిమ బెంగాల్‌లో 1,672, రాజస్థాన్‌లో 1,276 ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 16,56,341కి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 19.65%గా ఉన్నట్టు వివరించింది.

మార్చి నుంచి 12- 14 ఏళ్ల పిల్లలకు టీకాలు!

దిల్లీ: దేశంలో మార్చి తర్వాత 12-14 ఏళ్ల పిల్లలకు టీకాలు మొదలయ్యే సూచనలున్నాయని కొవిడ్‌ టీకాలపై జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టీఏజీఐ) ఛైర్మన్‌ డా।। ఎన్‌.కె.అరోడా సోమవారం వెల్లడించారు. 15 - 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలు దేశంలో 7.4 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 3.45 కోట్ల మందికి పైగా ఇప్పటికే మొదటి డోసు ‘కొవాగ్జిన్‌’ తీసుకున్నారు. మరో 28 రోజుల్లో వీరికి రెండో డోసు వ్యాక్సినేషను ముగుస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం 12-14 ఏళ్ల వయసు పిల్లలపై దృష్టి పెడుతుందని, ఈ వయసు పిల్లలు దేశంలో సుమారు 7.5 కోట్లు ఉన్నట్లు ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని