ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో రాష్ట్రం

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. విజయవాడలో టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 70 లక్షల మంది అసంఘటిత కార్మికుల జీవనోపాధికి సీఎం జగన్‌ గండి కొట్టారన్నారు.

Published : 02 May 2022 05:39 IST

 తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

సీతారాంపురం (విజయవాడ), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. విజయవాడలో టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 70 లక్షల మంది అసంఘటిత కార్మికుల జీవనోపాధికి సీఎం జగన్‌ గండి కొట్టారన్నారు. నాడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి పింఛను వచ్చేలా చేస్తానన్న జగన్‌.. నేడు వారికి పింఛను లేకుండా చేశారని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు రూ.10వేల వాహనమిత్ర ఇస్తామని నమ్మబలికి, 20 శాతం మందికే ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడిని టీఎన్‌టీయూసీ నేతలు గజమాలతో సత్కరించారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌, టీఎన్‌టీయూసీ గౌరవాధ్యక్షుడు శేషగిరిరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు, టీఎన్‌టీయూసీ అధ్యక్షులు, కార్మికులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని