ఏడు సంకలనాలుగా జనసేన ప్రస్థానం

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ 2014 మార్చి 14 నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రసంగాలు, వెల్లడించిన అభిప్రాయాలను పుస్తక రూపంలో ఆ పార్టీ మీడియా విభాగం సిద్ధం చేసింది. ఏడు సంకలనాలుగా ఉన్న ఈ పుస్తకాలను పార్టీ అధినేతకు గురువారం హైదరాబాద్‌లోని జనసేన ప్రధాన కార్యాలయంలో అందజేసింది. ‘ఈ పుస్తకాలు నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి.

Published : 20 May 2022 06:07 IST

పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు అందజేత

ఈనాడు, అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ 2014 మార్చి 14 నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రసంగాలు, వెల్లడించిన అభిప్రాయాలను పుస్తక రూపంలో ఆ పార్టీ మీడియా విభాగం సిద్ధం చేసింది. ఏడు సంకలనాలుగా ఉన్న ఈ పుస్తకాలను పార్టీ అధినేతకు గురువారం హైదరాబాద్‌లోని జనసేన ప్రధాన కార్యాలయంలో అందజేసింది. ‘ఈ పుస్తకాలు నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. పార్టీ ఎదుగుదలను తెలియజేసేలా ఇవి ఉన్నాయి. ఈ ప్రయాణంలో జనసేన ఎంతగా ప్రజలతో మమేకమైందీ, ప్రజాసేవకు ఏ విధంగా అంకితమైనదీ ఇవి తెలియజేస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలు తెలియజెప్పే అభిప్రాయాలు, ప్రజా సమస్యలు, రాజకీయ సామాజిక అంశాలపై చేసిన ప్రసంగాలను అక్షరబద్ధం చేయడం పార్టీ శ్రేణులకు ఎంతో ఉపయుక్తం. నాకూ దిక్సూచిలా ఉంటాయి’ అని పవన్‌కల్యాణ్‌ వీటిపై స్పందించారు. ప్రతి జిల్లాలో తాను మాట్లాడినవి, స్థానిక సమస్యల నుంచి రాష్ట్ర స్థాయి సమస్యల వరకు ఏ విధంగా స్పందించామో ఈ పుస్తకాలు తెలియజేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పవన్‌కల్యాణ్‌ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌, పార్టీ మీడియా విభాగ ప్రతినిధులు వి.చక్రవర్తి, ఎల్‌.వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని