బీజం వేసిందెవరో అందరికీ తెలుసు

అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. బాధ్యత కలిగిన హోం మంత్రి ప్రకటన చేస్తూ.. జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నానని

Published : 25 May 2022 05:21 IST

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. బాధ్యత కలిగిన హోం మంత్రి ప్రకటన చేస్తూ.. జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నానని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘వైకాపా ప్రభుత్వ లోపాలను, శాంతిభద్రతల పరిరక్షణలో అసమర్థత, వైకాపా వైఫల్యాలను జనసేనపై రుద్దకండి’ అని సూచించారు. ‘అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. మహనీయుడు అంబేడ్కర్‌ పేరును వివాదాల్లోకి తీసుకొచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అమలాపురం ఘటనను ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలి. ప్రజలందరూ సంయమనం పాటించి శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలి. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవభావమే. ఆయన పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలకవర్గం విఫలమైంది. వారి తప్పులు, పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకునేందుకు లేని సమస్యలు సృష్టిస్తున్నారు. వాళ్ల వైఫల్యాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారు’ అని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని