అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకించడం సిగ్గుచేటు

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్‌ అంబేడ్కర్‌ పేరును ఏపీలోని కోనసీమ జిల్లాకు పెడితే వ్యతిరేకించడం సిగ్గుచేటని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు

Published : 25 May 2022 05:42 IST

మందకృష్ణ మాదిగ

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్‌ అంబేడ్కర్‌ పేరును ఏపీలోని కోనసీమ జిల్లాకు పెడితే వ్యతిరేకించడం సిగ్గుచేటని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్ల మీద దాడి హేయమని తెలిపారు. కోనసీమలో విధ్వంస ఘటనల వెనుక ఉన్న అరాచక శక్తులను కఠినంగా శిక్షించాలని ఆయన మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ‘మహనీయుడైన అంబేడ్కర్‌ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడాన్ని సహించలేని వారు విధ్వంసాలు సృష్టించడం దారుణం. ఆయన పేరు పెట్టాలని అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు కోరిన మీదటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని వ్యతిరేకించడం, ఉద్యమాలు చేయడం వెనక భయంకరమైన కుట్ర ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని