జూన్‌ 23న ఆత్మకూరు ఉపఎన్నిక

నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు నగారా మోగింది. జూన్‌ 23న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వైకాపా తరఫున పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఐటీ, పరిశ్రమల మంత్రిగా పని చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి

Published : 26 May 2022 06:07 IST

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో ఖాళీ అయిన శాసనసభ స్థానం

షెడ్యూల్‌ ప్రకటించిన ఎన్నికల సంఘం

 ఈనాడు, అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు నగారా మోగింది. జూన్‌ 23న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వైకాపా తరఫున పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఐటీ, పరిశ్రమల మంత్రిగా పని చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక జరగనుంది. దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. 

ఏకగ్రీవ అవకాశాలు తక్కువే!

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా మేకపాటి విక్రమ్‌రెడ్డి బరిలో దిగనున్నారు. ఆయన దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు. మృతుడి కుటుంబ సభ్యులే పోటీలో ఉన్నందున ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు తక్కువ. గతం నుంచి పాటిస్తున్న సంప్రదాయాన్నే ఈసారీ పాటించాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే తెదేపా పోటీ చేయకపోయినప్పటికీ.. వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు తక్కువే. భాజపా సహా మరికొన్ని పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశం ఉన్నందున ఎన్నిక జరిగేందుకే ఎక్కువగా ఆస్కారం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని