AP News: కన్నీళ్ల కడలిలో అంతిమ సంస్కారం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అంత్యక్రియలు కూడా చేయలేని దుస్థితి నెలకొంది. ఎక్కడ తవ్వినా నీరు ఉబికి వస్తోంది. కడప నగరంలో మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందాడు. శ్మశానంలో అంత్యక్రియలు చేసేందుకు మృతదేహాన్ని బంధువులు

Updated : 01 Dec 2021 07:47 IST

టీవల కురిసిన భారీ వర్షాలకు అంత్యక్రియలు కూడా చేయలేని దుస్థితి నెలకొంది. ఎక్కడ తవ్వినా నీరు ఉబికి వస్తోంది. కడప నగరంలో మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందాడు. శ్మశానంలో అంత్యక్రియలు చేసేందుకు మృతదేహాన్ని బంధువులు తీసుకెళ్లారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటితో శ్మశానం మొత్తం జలమయమైంది. గొయ్యి తవ్వుతుంటే నీళ్లు ఉబికి వచ్చాయి. దీంతో జేసీబీతో నీటిలోనే గొయ్యి తవ్వారు. మృతదేహాన్ని నీటిలో ముంచి ట్రాక్టరుతో మట్టి తీసుకొచ్చి కప్పిపెట్టారు. అంత్యక్రియలు ఇలా చేయడం బాధగా ఉందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

- న్యూస్‌టుడే, కడప(చిన్నచౌకు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని