తగిన పత్రాలు లేకుంటే జరిమానాలే

ఇప్పటివరకు వాహనాల డ్రైవింగ్‌ లైసెన్సులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, పర్మిట్లు వంటివి గడువు ముగిసినా, లేకపోయినా అంతగా పట్టించుకోని రవాణాశాఖ.. ఇకపై వీటన్నింటిపైనా జరిమానాలు విధించేందుకు సన్నద్ధమైంది.

Updated : 02 Dec 2021 04:30 IST

ఈనాడు, అమరావతి: ఇప్పటివరకు వాహనాల డ్రైవింగ్‌ లైసెన్సులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, పర్మిట్లు వంటివి గడువు ముగిసినా, లేకపోయినా అంతగా పట్టించుకోని రవాణాశాఖ.. ఇకపై వీటన్నింటిపైనా జరిమానాలు విధించేందుకు సన్నద్ధమైంది. తనిఖీలు ముమ్మరం చేయాలని, నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానాలు వేయాలంటూ క్షేత్రస్థాయిలో అధికారులను ఆదేశించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తనిఖీలు నిర్వహించి, జరిమానాల ద్వారా రూ.352 కోట్లు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు రూ.70 కోట్ల వరకు వసూళ్లయ్యాయి. తనిఖీలు పెంచి మార్చి లోగా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరాలని నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని