Perni Nani:‘సినిమా’ తప్ప వేరే పనేం లేదా

సినిమా టికెట్ల విషయం తప్ప రాష్ట్రంలో మీడియాకు వేరే పనేం లేకుండా పోయిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్‌ ఆవరణలో ఎన్టీఆర్‌ టు వైఎస్‌ఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి పోటీల తొలి రోజు విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...

Updated : 12 Jan 2022 08:12 IST

మంత్రి పేర్ని నాని

గుడివాడ, న్యూస్‌టుడే: సినిమా టికెట్ల విషయం తప్ప రాష్ట్రంలో మీడియాకు వేరే పనేం లేకుండా పోయిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్‌ ఆవరణలో ఎన్టీఆర్‌ టు వైఎస్‌ఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి పోటీల తొలి రోజు విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పేదల సంక్షేమానికి పాటుపడిన మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ల పేరిట పోటీలను పెద్దఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు. పశుసంపద, సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేలా మంత్రి కొడాలి నాని సోదరులు అయిదేళ్లుగా పోటీలు నిర్వహిస్తుండడం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా విలేకరులు సినిమా టికెట్ల ధరలపై ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ... ప్రజలకు, వ్యవస్థలకు అవసరమైన విషయాలపై మీడియా స్పందిస్తే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. మీడియాకు సినిమా టికెట్ల విషయం తప్ప వేరే ఏమీ లేవా అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రెండు పాలపళ్ల ఎద్దుల విభాగం పోటీల్లో విజేతలకు ఆయన నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. మంత్రి కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని, వైకాపా నాయకులు దుక్కిపాటి శశిభూషణ్‌, పాలేటి చంటి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని