24 నుంచి ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు తరగతులు

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీలలో ఈ నెల 24వ తేదీ నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు వర్సిటీ కులపతి ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. కొవిడ్‌ పరిస్థితులు, విద్యార్థుల భద్రతను

Published : 19 Jan 2022 04:47 IST

వేంపల్లె, నూజివీడు, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీలలో ఈ నెల 24వ తేదీ నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు వర్సిటీ కులపతి ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. కొవిడ్‌ పరిస్థితులు, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విడతల వారీగా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్‌ఐటీలలోని ఈ4 విద్యార్థులకు 24 నుంచి క్యాంపస్‌లో తరగతులు ఉంటాయన్నారు. అన్ని క్యాంపస్‌లలో ఈ నెల 28 నుంచి పీ1 విద్యార్థులకు, 31వ తేదీ నుంచి పీ2 విద్యార్థులకు, ఇంజినీరింగ్‌ తృతీయ సంవత్సరం చదివే విద్యార్థులకు ఫిబ్రవరి 2న తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని