సీఎస్‌పై ఆరోపణలు తగవు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) రాష్ట్ర ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు తగవని ఐఏఎస్‌ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎస్‌ను ఉద్దేశించి సూర్యనారాయణ అనే

Published : 20 Jan 2022 05:23 IST

ఐఏఎస్‌ అధికారుల సంఘం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) రాష్ట్ర ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు తగవని ఐఏఎస్‌ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎస్‌ను ఉద్దేశించి సూర్యనారాయణ అనే ప్రభుత్వ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలను తమ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని ఐఏఎస్‌ల సంఘం ఆశిస్తోందన్నారు. ‘ప్రభుత్వ ఉద్యోగులందరికీ పరిపాలనా అధిపతి అయిన సీఎస్‌... సంఘాల మాదిరే ఉద్యోగుల విషయంలో బాధ్యత కలిగి ఉంటారు. సీఎస్‌ అయినా, ఇతర అధికారులైనా సమస్యలపై నిష్పాక్షికంగా తమ అభిప్రాయాలను వృత్తిపరంగా తెలియజేస్తారు’ అని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు