Mamitha Baiju: నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్‌ పేరు వెనుక కథేంటంటే?

‘ప్రేమలు’ హీరోయిన్‌ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా?

Published : 05 May 2024 12:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేరుగా టాలీవుడ్‌లో నటించకపోయినా తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది ‘ప్రేమలు’ (Premalu) భామ మమితా బైజు (Mamitha Baiju). మలయాళంలో హిట్‌ అందుకున్న ఈ సినిమా ఇక్కడా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ బ్యూటీ తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో యువతలో విశేష క్రేజ్‌ సంపాదించుకుంది. ఆమె పేరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ ఇంటర్వ్యూలో ఆ పేరు వెనుక ఉన్న కథేంటో చెప్పింది.

మమిత గురించి మరికొన్ని ఆసక్తికర విశేషాలు..

తన అసలు పేరు నమిత అని, ఆస్పత్రి సిబ్బంది బర్త్‌ సర్టిఫికెట్‌లో మమితగా నమోదు చేశారని తెలిపింది. స్కూల్‌లో జాయిన్‌ అయ్యే సమయానికిగానీ ఆ తప్పును పేరెంట్స్‌ గుర్తించలేదని పేర్కొంది. విభిన్నంగా ఉందని భావించి ఆ పేరును మార్చలేదంది. మమిత అంటే మిఠాయి అని తెలిపింది. ‘ప్రేమలు’ తన తొలి సినిమా అని చాలామంది అనుకుంటారని, అది 16వ చిత్రమని స్పష్టం చేసింది. ఈ ముద్దుగుమ్మ ‘రెబల్‌’ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ హీరోగా రూపొందిన ఈ ఫిల్మ్‌ మార్చిలో విడుదలైంది. విష్ణు విశాల్‌ సరసన ఓ సినిమాలో నటించనుంది.

తెలుగు సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. తెలుగు చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. నటిగా మమితకు మంచి భవిష్యత్తు ఉందని అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రశంసించడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. ‘ప్రేమలు’ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని.. ఆమె గతంలో నటించిన పలు సినిమాలను తెలుగులో డబ్‌ చేస్తున్నారు. అలా వచ్చిందే ‘ప్రణయ విలాసం’. ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని