AP News: జీవితాంతం సమ్మెలో ఉండరు కదా.. చర్చకు రావాల్సిందే: మంత్రి పేర్ని నాని

సోమవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి పేర్ని నాని ఉద్యోగుల సమ్మె నోటీసు అంశంపై విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ..‘సమ్మె నోటీసు ఇచ్చినా.. జీవితాంతం సమ్మెలో

Updated : 25 Jan 2022 07:46 IST

ఈనాడు, అమరావతి: సోమవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి పేర్ని నాని ఉద్యోగుల సమ్మె నోటీసు అంశంపై విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ..‘సమ్మె నోటీసు ఇచ్చినా.. జీవితాంతం సమ్మెలో ఉండరు కదా? ఏదో ఒక రోజు ప్రభుత్వంతో చర్చకు రావాల్సిందే కదా? అందువల్లే వారికున్న అంశాలేవో వచ్చి ప్రభుత్వంతో మాట్లాడమని కోరుతున్నాం. నోటీసుపై మాకు అభ్యంతరం లేదు. ఇప్పటికీ వారిని ఆహ్వానిస్తున్నాం. నోటీసుతో మీరు ఒక అడుగు ముందుకు వేసినా ఎప్పటికీ మీరు మా పిల్లలే, ప్రభుత్వం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మనస్ఫూర్తిగా చర్చకు ఆహ్వానిస్తున్నాం. అంతేతప్ప చర్చలకు రాకుండా ఎక్కడో మీడియాలో మేం మాట్లాడినదాన్నే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలనడం ఎంతవరకు ధర్మం?’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని