Andhra News: ప్రైవేటు పాఠశాలలకు అమ్మఒడి ఎందుకు?: వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి ఇవ్వడం తగదని కడప జిల్లా మైదుకూరు వైకాపా ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి అన్నారు. శుక్రవారం కడప జిల్లా చాపాడు

Updated : 05 Mar 2022 07:37 IST

చాపాడు, న్యూస్‌టుడే: ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి ఇవ్వడం తగదని కడప జిల్లా మైదుకూరు వైకాపా ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి అన్నారు. శుక్రవారం కడప జిల్లా చాపాడు మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాగా డబ్బులున్నవారే ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తారని, అలాంటి వారికి అమ్మఒడి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి సూచిస్తానన్నారు. జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ (ఐసీడీఎస్‌) అవినీతిలో కూరుకుపోయిందని ఆ శాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్‌వైజర్ల బదిలీల్లో ఎవరు డబ్బులిస్తే వారిని కాల పరిమితుల్లేకుండా కావాల్సిన చోటికి బదిలీలు చేసుకుంటున్నారని తెలిపారు. ఎక్కడా పర్యవేక్షణ లేదని, లబ్ధిదారులకు సరిగా ఆహారం అందడంలేదని మండల సమావేశం తీర్మానం చేస్తున్నట్లు రాయాలని ఎమ్మెల్యే ఎంపీడీవోను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు