Andhra News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. బద్వేలుకు గుజరాత్‌ యువతి

గుజరాత్‌కు చెందిన ఓ యువతికి, వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేలుకు చెందిన ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమై, ప్రేమించుకున్నారు. దీంతో యువతి బద్వేలుకు వ

Published : 15 May 2022 10:24 IST

అమ్మాయిని స్వరాష్ట్రానికి పంపిన భాజపా జిల్లా అధ్యక్షుడు

కడప, న్యూస్‌టుడే: గుజరాత్‌కు చెందిన ఓ యువతికి, వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేలుకు చెందిన ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమై, ప్రేమించుకున్నారు. దీంతో యువతి బద్వేలుకు వచ్చేసింది. ఆమె తల్లిదండ్రులు గుజరాత్‌లో కేసు నమోదు చేశారు. ఆ రాష్ట్ర పోలీసులు 5 రోజుల కిందట  బద్వేలుకు వచ్చారు. విషయం తెలుసుకున్న భాజపా జిల్లా అధ్యక్షుడు యల్లారెడ్డి బద్వేలుకు వెళ్లి అమ్మాయిని ఒప్పించి తిరిగి గుజరాత్‌కు పంపించారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ అన్బురాజన్‌, పోలీసుల సహకారం బాగుందని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్‌ దేవధర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని