నేవీ అడ్వాన్స్‌డ్‌ లైట్‌హెలికాప్టర్‌ జాతికి అంకితం

భారత నౌకాదళ వాయు కేంద్రం ‘ఐఎన్‌ఎస్‌ డేగా’లో సోమవారం అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ (ఏఎల్‌హెచ్‌-324)కు సంబంధించిన తొలి స్క్వాడ్రన్‌ను తూర్పు నౌకాదళాధిపతి, వైస్‌అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా జాతికి అంకితం చేశారు. విశాఖలోని ఈ

Published : 05 Jul 2022 05:15 IST

విశాఖపట్నం (సింధియా), న్యూస్‌టుడే: భారత నౌకాదళ వాయు కేంద్రం ‘ఐఎన్‌ఎస్‌ డేగా’లో సోమవారం అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ (ఏఎల్‌హెచ్‌-324)కు సంబంధించిన తొలి స్క్వాడ్రన్‌ను తూర్పు నౌకాదళాధిపతి, వైస్‌అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా జాతికి అంకితం చేశారు. విశాఖలోని ఈ కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ హెలికాప్టర్లను దేశీయంగా హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో రూపొందించారు. తూర్పు తీరంలో నిఘాకు, సహాయ చర్యలు చేపట్టేందుకు ఈ లోహ విహంగం ఉపయోగపడుతుంది. ఏఎల్‌హెచ్‌ తొలి స్క్వాడ్రన్‌కు ‘క్రెస్ట్రల్స్‌’ అని నామకరణం చేశారు. ‘చిట్టి డేగ’ అని దీని అర్థం. దీన్ని అత్యవసర వైద్య సదుపాయానికి ఎయిర్‌ అంబులెన్సుగా వినియోగిస్తారు. కమాండర్‌గా ఎస్‌ఎస్‌ దాస్‌ సేవలు అందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని