పీజీ వైద్య విద్య యాజమాన్య కోటా ప్రవేశాలకు ప్రకటన

2022-23 విద్యా సంవత్సరానికి ప్రైవేటు, మైనార్టీ కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ డిగ్రీ/ డిప్లొమా, ఎండీఎస్‌ కోర్సుల యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి

Published : 17 Aug 2022 05:22 IST

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: 2022-23 విద్యా సంవత్సరానికి ప్రైవేటు, మైనార్టీ కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ డిగ్రీ/ డిప్లొమా, ఎండీఎస్‌ కోర్సుల యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించి డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. నీట్‌ పీజీ-2022 అర్హత సాధించిన అభ్యర్థులు బుధవారం (17న) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొని సంబంధిత పత్రాలను జత చేసి పంపాల్సి ఉంటుంది. నీట్‌ పీజీలో జనరల్‌ కేటగిరీలో 275 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/బీసీలు  245 మార్కులు, అన్‌ రిజర్వుడు/ దివ్యాంగుల కేటగిరీ 260 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించారు. యాజమాన్య కోటా క్లినికల్‌ డిగ్రీ/డిప్లొమా కోర్సులకు రూ.8,64,000 (ఎస్‌1)గా, ఎన్నారై కోటా ఎస్‌ 2, ఎస్‌ 3 కేటగిరీలకు రూ.50,00,000 ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  సాంకేతికపరంగా సమస్యలుంటే 74165 63063, 74162 53073లకు, మార్గనిర్దేశకాల్లో సందేహాలుంటే 89787 80501 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని