హైదరాబాద్‌ వెళ్లేందుకు.. ట్రయల్‌ కోర్టును ఆశ్రయించండి

కంటి శుక్లం శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌ వెళ్లేందుకు అనుమతి కోసం ఎన్‌ఐఏ కోర్టును ఆశ్రయించాలని వరవరరావుకు సుప్రీంకోర్టు తెలిపింది. భీమా కోరేగావ్‌ కేసులో అరెస్టయి ముంబయి జైలులో ఉన్న 82 ఏళ్ల వరవరరావుకు.. అనారోగ్య

Updated : 18 Aug 2022 05:25 IST

వరవరరావుకు సుప్రీంకోర్టు అనుమతి

ఈనాడు, దిల్లీ: కంటి శుక్లం శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌ వెళ్లేందుకు అనుమతి కోసం ఎన్‌ఐఏ కోర్టును ఆశ్రయించాలని వరవరరావుకు సుప్రీంకోర్టు తెలిపింది. భీమా కోరేగావ్‌ కేసులో అరెస్టయి ముంబయి జైలులో ఉన్న 82 ఏళ్ల వరవరరావుకు.. అనారోగ్య కారణాల నేపథ్యంలో ఈ నెల 10న సుప్రీంకోర్టు బెయిలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్‌ఐఏ కోర్టు ముందస్తు అనుమతి లేకుండా ముంబయి దాటి వెళ్లరాదని షరతు విధించింది. ఈ నేపథ్యంలో కంటి శుక్లం శస్త్రచికిత్స చేయించుకునేందుకు హైదరాబాద్‌ వెళ్లేందుకు అనుమతించాలని, బెయిల్‌ షరతులను సడలించాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.ఆర్‌.భట్‌, జస్టిస్‌ సుధాంశు ధులియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. అనుమతి కోసం రెండు వారాల్లోపు ఎన్‌ఐఏ కోర్టుని ఆశ్రయించేందుకు వరవరరావుకు స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని