తెలంగాణ లాసెట్‌లో ఏపీ విద్యార్థుల ప్రతిభ

తెలంగాణ లాసెట్‌లో 74 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 28,921 మంది పరీక్షలు రాయగా వారిలో 21,662 మంది కనీస మార్కులు పొంది కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు.

Published : 18 Aug 2022 04:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ లాసెట్‌లో 74 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 28,921 మంది పరీక్షలు రాయగా వారిలో 21,662 మంది కనీస మార్కులు పొంది కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్‌, కన్వీనర్‌ జీబీ రెడ్డి తదితరులు బుధవారం సాయంత్రం ఈ ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో తొలి 10 ర్యాంకర్లలో ఏపీ అభ్యర్థులు ఒకటి, రెండు, ఏడు, తొమ్మిది ర్యాంకులు సాధించారు. ఎల్‌ఎల్‌ఎం విభాగంలో మొదటి 10 ర్యాంకర్లలో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో అన్నమయ్య జిల్లా, రాయచోటికి చెందిన మద్దిపట్ల సాయికృష్ణ, తూర్పు గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన బొడ్డు  శ్రీరాం, హైదరాబాద్‌ రామంతపూర్‌కు చెందిన ఈమని హర్ష యశస్కర్‌ తొలి మూడు ర్యాంకులు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని