2 నెలలు.. 3,300 టీఎంసీలు

ఎగువన కురిసిన వర్షాల కారణంగా గోదావరిలో మరోసారి వరద ప్రవాహం పెరుగుతోంది. జలవనరుల శాఖ అధికారులు వచ్చిన జలాలను వచ్చినట్లు సముద్రంలోకి, పంట కాలువల్లోకి వదులుతున్నారు. బలహీనపడిన ఏటిగట్ల

Published : 18 Aug 2022 04:56 IST

సముద్రంలోకి చేరిన గోదావరి జిలాలు

ఈనాడు, కాకినాడ: ఎగువన కురిసిన వర్షాల కారణంగా గోదావరిలో మరోసారి వరద ప్రవాహం పెరుగుతోంది. జలవనరుల శాఖ అధికారులు వచ్చిన జలాలను వచ్చినట్లు సముద్రంలోకి, పంట కాలువల్లోకి వదులుతున్నారు. బలహీనపడిన ఏటిగట్ల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు. జులై, ఆగస్టు వరదల్లో ఇప్పటివరకు 3,300 టీఎంసీల జలాలను సముద్రంలోకి వదిలినట్లు జలవనరుల శాఖ ధవళేశ్వరం సర్కిల్‌ ఎస్‌ఈ నర్సింహమూర్తి తెలిపారు. కాలువల్లోకి 48 టీఎంసీల వరకు విడిచిపెట్టామన్నారు. రెండురోజుల క్రితం ఎగువన కురిసిన వర్షాల ప్రభావంతో గోదావరి ఉద్ధృతి పెరుగుతోందని.. గురువారం నాటికి పరిస్థితి కుదుట పడవచ్చని తెలిపారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు నీటి మట్టం 15.20 అడుగులకు చేరింది. సముద్రంలోకి 15,12,848, కాలువల్లోకి 11,000 క్యూసెక్కులు విడిచిపెట్టారు. వరదల తాకిడితో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు రెండు నెలలుగా విలవిల్లాడుతూనే ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని