తప్పకనే దసరా ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలు

ప్రతిఏటా పండుగ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీ వసూలు చేస్తున్నామనే అప్రతిష్ఠను తొలగించుకునేందుకు.. తొలిసారిగా దసరా కోసం వేసే ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే

Published : 24 Sep 2022 05:31 IST

సంక్రాంతి నుంచే టీఎస్‌ ఆర్టీసీ అమలు

ఈనాడు, అమరావతి: ప్రతిఏటా పండుగ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీ వసూలు చేస్తున్నామనే అప్రతిష్ఠను తొలగించుకునేందుకు.. తొలిసారిగా దసరా కోసం వేసే ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే తీసుకోనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. ప్రజలపై భారం లేకుండా చూసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు గొప్పగా చెప్పింది. అయితే వాస్తవం మరోలా ఉంది. తప్పనిసరై మరో మార్గంలేక సాధారణ ఛార్జీలు వసూలు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తెలంగాణ ఆర్టీసీ ఈ ఏడాది సంక్రాంతికి నడిపిన ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలతోనే నడిపింది. ఆ సమయంలో ఏపీఎస్‌ఆర్టీసీకి గట్టిపోటీ ఎదురైంది. ఇపుడు దసరాకు సైతం టీఎస్‌ఆర్టీసీ సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ముందుగానే ప్రకటించింది. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ కూడా తప్పనిసరై అదనపు ఛార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులు నడిపేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని