డిజిటల్‌ ఆరోగ్య సేవలకు 6 జాతీయ అవార్డులు

జాతీయ స్థాయిలో చేపట్టిన డిజిటల్‌ ఆరోగ్య సేవల్లో రాష్ట్రానికి ఆరు జాతీయ అవార్డులు వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో...

Published : 27 Sep 2022 05:25 IST

ఈనాడు, అమరావతి: జాతీయ స్థాయిలో చేపట్టిన డిజిటల్‌ ఆరోగ్య సేవల్లో రాష్ట్రానికి ఆరు జాతీయ అవార్డులు వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వీటిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాండవీయా నుంచి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్‌ స్వీకరించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో అత్యధిక హెల్త్‌ రికార్డుల అనుసంధానం, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని అన్ని ఆసుపత్రుల రిజిస్ట్రేషన్‌, హెల్త్‌ రికార్డుల సమీకృతం చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు, డిజిటలైజేషన్‌లో ముందంజలో ఉన్నందుకు బాపట్ల, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున అవార్డులు వచ్చాయని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని