3 లక్షల మందికి గరుడ వాహన దర్శనం!

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధానమైన గరుడసేవను పురస్కరించుకుని అక్టోబరు 1న వాహన సేవకు విచ్చేసే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

Published : 30 Sep 2022 03:18 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధానమైన గరుడసేవను పురస్కరించుకుని అక్టోబరు 1న వాహన సేవకు విచ్చేసే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. గురువారం శ్రీవారి ఆలయ 4 మాడ వీధుల్లోని హారతి పాయింట్లు, గ్యాలరీలను అనంతపురం రేంజి డీఐజీ రవిప్రకాష్‌, తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డితో కలిసి ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 3 లక్షల మందికి శ్రీవారి గరుడ వాహన దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది హారతి పాయింట్లలో హారతులకు బదులుగా భక్తులను అనుమతిస్తామని తెలిపారు. ప్రతి హారతి పాయింట్‌లో 10వేల మందికి గరుడసేవ దర్శనం కల్పించేందుకు అవకాశం ఉందని చెప్పారు. గ్యాలరీల్లో రెండు లక్షల మంది, ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనం మండపం వద్దకు షాపింగ్‌ కాంప్లెక్స్‌ నుంచి భక్తులను రెండోసారి అనుమతించడం ద్వారా మరో 25వేల మందికి అదనంగా దర్శనం కల్పించవచ్చని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని