నీరుగారుతున్న ‘నాడు-నేడు’!

ఆసుపత్రిలోని ప్రసూతి గది కురుస్తుంటే.. అందులోని గర్భిణి తడవకుండా పురుడు పోసేందుకు సిబ్బంది నానా కష్టాలుపడ్డారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ‘నాడు-నేడు’ పనులు చేపట్టారు.

Published : 07 Oct 2022 03:18 IST

న్యూస్‌టుడే, దేవరాపల్లి: ఆసుపత్రిలోని ప్రసూతి గది కురుస్తుంటే.. అందులోని గర్భిణి తడవకుండా పురుడు పోసేందుకు సిబ్బంది నానా కష్టాలుపడ్డారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ‘నాడు-నేడు’ పనులు చేపట్టారు. బిల్లులు రాలేదని గుత్తేదారు పనులు ఆర్నెల్ల కిందట వదిలేశారు. ఆసుపత్రి పైకప్పు పెచ్చులు పెకలదీసి, శిథిలాలను అక్కడే ఉంచారు. వర్షాలకు పైకప్పు నుంచి నీరు లీకవుతోంది. ప్రసవాలు చేసే గదీ కురుస్తోంది. గురువారం ఉదయం ఓ గర్భిణికి ప్రసవం చేయాల్సి ఉండగా.. అదే సమయంలో వానొచ్చింది. చివరికి గర్భిణి ఉన్న బల్లను ఒక మూలకు చేర్చి.. గదిలో నీరు కారుతున్న చోటల్లా బకెట్లు, బేసిన్లు పెట్టి కాన్పు చేశారు. ఈ వానాకాలం మొత్తం ఇలానే గడిచిందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని