రాజరాజేశ్వరిదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

విజయవాడ దుర్గగుడిలో దసరా శరన్నవరాత్రోత్సవాలు బుధవారంతో ముగిశాయి. బుధవారం విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరిదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 07 Oct 2022 03:18 IST

ఈనాడు, అమరావతి: విజయవాడ దుర్గగుడిలో దసరా శరన్నవరాత్రోత్సవాలు బుధవారంతో ముగిశాయి. బుధవారం విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరిదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజు భక్తులు పోటెత్తారు. మొత్తంగా పది రోజుల్లో 12లక్షల మందికి పైగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఏటా ఉత్సవాల చివరి రోజు నిర్వహించే తెప్పోత్సవం ఈసారి రద్దయింది. కృష్ణా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం, బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.


నిజరూప అలంకారంలో భ్రమరాంబాదేవి దర్శనం

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా సాయంత్రం 6.30 గంటలకు భ్రమరాంబాదేవి నిజరూప అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పుష్కరిణి వద్ద అలంకరించిన తెప్పపై స్వామిఅమ్మవార్లను కొలువుదీర్చి తెప్పోత్సవాన్ని నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని