పంటభూమి మునిగి.. గుండె చెరువైంది!

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామం వద్ద శుక్రవారం కనిపించిన పరిస్థితి ఇది. ఇక్కడ వెద పద్ధతిలో 300 ఎకరాల్లో వరి వేశారు.

Published : 08 Oct 2022 03:40 IST

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామం వద్ద శుక్రవారం కనిపించిన పరిస్థితి ఇది. ఇక్కడ వెద పద్ధతిలో 300 ఎకరాల్లో వరి వేశారు. మరికొంత మంది మిర్చి, శనగ వేసేందుకు భూమిని సిద్ధం చేశారు. రెండురోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పోతురాజు కాలువ, నల్ల వాగుల నీరు ఈ పొలాలను ముంచెత్తింది. ఎగువ నుంచి ఇంకా ప్రవాహం వస్తూనే ఉంది. పంట కుళ్లిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అల్లూరుకు చెందిన రైతు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ 15 ఎకరాల్లో వరి వేశానని.. ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చయిందన్నారు. నీళ్లు ఎక్కువ  రోజులు నిల్వ ఉంటే ఇప్పుడు పెట్టిన పెట్టుబడి వృథా అవుతుందని, మళ్లీ పంట వేయడానికి భూమిని సిద్ధం చేయాలని ఆవేదన చెందారు. సమీపంలోని కొప్పోలు, చింతల ప్రాంతాల్లోనూ పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.

-ఈనాడు, ఒంగోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని