AP Govt: జగనన్నకు చెబుదాం.. ప్రజల సమస్యల పరిష్కారానికి ఓ వ్యవస్థ

‘ప్రజా సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాకుండా మిగిలిపోరాదు.. వేటికి ఎలాంటి పరిష్కారాలను చూపాలనే దానిపై ఒక విధానాన్ని తయారు చేసేందుకు అధికారులు కసరత్తు చేయాలి’ అని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు.

Updated : 01 Nov 2022 09:48 IST

ఉన్నతాధికారులతో సీఎం చర్చ

ఈనాడు, అమరావతి: ‘ప్రజా సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాకుండా మిగిలిపోరాదు.. వేటికి ఎలాంటి పరిష్కారాలను చూపాలనే దానిపై ఒక విధానాన్ని తయారు చేసేందుకు అధికారులు కసరత్తు చేయాలి’ అని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ‘ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ), ఇతర అధికార వ్యవస్థకు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు, చేసిన వినతులకు పరిష్కారం చూపడమే ఉద్దేశంగా ఈ విధానం ఉండాలి’ అని చెప్పారు. స్పందన కార్యక్రమం కంటే మరింత మెరుగ్గా, సమర్థంగా దీన్ని నిర్వహించాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు.. ఈ నూతన విధానానికి ‘జగనన్నకు చెబుదాం’ అనే పేరు సీఎంఓ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘స్పందన’ కార్యక్రమాన్ని మెరుగుపరిచి కొత్త పథకం తీసుకువస్తారా.. లేక దానికి సమాంతరంగా తీసుకువస్తారా.. అనేది తేలాల్సి ఉంది. ఈ నూతన విధానంలోనైనా ముఖ్యమంత్రి ప్రజలను కలుసుకుంటారా.. లేదా అనే విషయంలో స్పష్టత రావలసి ఉంది. ‘ప్రజా దర్బార్‌’ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతిరోజూ ముఖ్యమంత్రి ప్రజలను కలుస్తారని వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతూనే ఉన్నా ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని