Andhra News: ‘ఫ్యామిలీ ఫిజిషియన్‌’లకు రూ.4,500 పారితోషికం!

రాష్ట్రంలో ‘ఫ్యామిలీ ఫిజిషియన్‌’ కింద సేవలందించే వైద్యులకు పారితోషికం కింద నెలకు రూ.4,500 వరకు చెల్లించనున్నారు. పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులు నెలలో కనీసం 13 రోజుల నుంచి 15 రోజుల వరకు ఈ పథకం కింద గ్రామాలకు వెళ్తున్నారు. 

Updated : 22 Nov 2022 09:34 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ‘ఫ్యామిలీ ఫిజిషియన్‌’ కింద సేవలందించే వైద్యులకు పారితోషికం కింద నెలకు రూ.4,500 వరకు చెల్లించనున్నారు. పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులు నెలలో కనీసం 13 రోజుల నుంచి 15 రోజుల వరకు ఈ పథకం కింద గ్రామాలకు వెళ్తున్నారు. పారితోషికం చెల్లింపుపై త్వరలో ఉత్తర్వులు వస్తాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె.నివాస్‌ తెలిపారు. పీహెచ్‌సీల్లోని వైద్యులు సెలవుల్లో ఉన్నప్పుడు.. సీహెచ్‌సీల్లో పని చేసే వారిని గ్రామాలకు పంపుతున్నారు. వీరికి రోజుకు రూ.400 వరకు పారితోషికం ఇవ్వాలని భావిస్తున్నారు. గ్రామీణ సర్వీస్‌ కింద వీరు పని చేసినట్లు గుర్తించే అవకాశం ఉంది. ఈ పథకం ప్రారంభమై నెల రోజులైన సందర్భంగా బాగా పని చేసిన వైద్యుల్లో తొలి ఐదుగురిని జిల్లా అధికారులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు