ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) నూతన కార్యవర్గం(ఎపెక్స్‌ కౌన్సిల్‌) ఎన్నిక ఫలితాల ప్రకటనను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈనెల 1న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోవాలని, తాము దాఖలు చేయబోయే అప్పీల్‌పై అత్యవసర విచారణ జరపాలని ఏసీఏ ప్రస్తుత కార్యవర్గం తరఫు న్యాయవాది ఎన్‌.రవిప్రసాద్‌ చేసిన అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.

Published : 03 Dec 2022 03:49 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) నూతన కార్యవర్గం(ఎపెక్స్‌ కౌన్సిల్‌) ఎన్నిక ఫలితాల ప్రకటనను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈనెల 1న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోవాలని, తాము దాఖలు చేయబోయే అప్పీల్‌పై అత్యవసర విచారణ జరపాలని ఏసీఏ ప్రస్తుత కార్యవర్గం తరఫు న్యాయవాది ఎన్‌.రవిప్రసాద్‌ చేసిన అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. కబడ్డీ, క్రికెట్‌, ఫుట్‌బాల్‌ క్రీడలకంటే ముఖ్యమైన కేసులు తమ ముందు విచారణకు ఉన్నాయని వ్యాఖ్యానించింది. అత్యవసర విచారణ కోసం చేసిన అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని